ఆదాయపు పన్ను శాఖ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ నోటిఫికేషన్ స్పోర్ట్స్/2024-25

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఆదాయపు పన్ను శాఖ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ నోటిఫికేషన్ F.No.Pr.CCIT/Hyd/Admin/Recruitment/Sports/2024-25 విడుదల చేసింది.

sports notification
sports notification

#1. పరిచయం:

ఆదాయపు పన్ను శాఖ ఈసారి క్రీడాకారుల కోసం ప్రత్యేక ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, టాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్లో మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో సురక్షితమైన ఉద్యోగ అవకాశాలను క్రీడాకారులకు అందిస్తున్నాయి.

#2. ముఖ్యమైన తేదీలు:

– ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 మార్చి 2025 నుండి మొదలు అవుతుంది.
– దరఖాస్తు చివరి తేదీ: 5 ఏప్రిల్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
– డాక్యుమెంట్ ధృవీకరణ: మే 2025 న ఉంటుంది.
– చివరి ఎంపిక జాబితా: జూన్ 2025 న ఉంటుంది.

గమనిక: తేదీలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ ను నిరంతరం గమనిస్తూ ఉండండి.

#3. ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టుల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి:

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II: 2 ఖాళీలు
2. టాక్స్ అసిస్టెంట్: 28 ఖాళీలు
3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS):26 ఖాళీలు

4. ప్రతి పోస్ట్ గురించి వివరాలు :

 

#స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II:

వివరాలు:
ఈ పోస్టులో ఉద్యోగులు అధికారిక మీటింగ్లు, సమావేశాల సమయంలో షార్ట్ హ్యాండ్ రికార్డింగ్ మరియు టైపింగ్ పనులు చేయాలి. కార్యాలయంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కీలక పాత్ర పోషిస్తారు.

జీతం:
7వ CPC పే స్కేల్ లెవెల్-4 ప్రకారం రూ.25,500 నుండి 81,100 వరకు జీతం ఉంటుంది. ఇందులో బేసిక్ పే, DA, HRA మరియు ఇతర భత్యాలు చేర్చబడతాయి.

అర్హతలు:
– వయస్సు: 18 నుండి 27 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.(SC/ST/ఓబిసీలకు సడలింపు ఉంది)
– విద్య: 12వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
– క్రీడా అర్హత: జాతీయ/రాష్ట్ర స్థాయి టూర్నమెంట్లలో పాల్గొన్న రికార్డు ఉండాలి.

 

#టాక్స్ అసిస్టెంట్:

వివరాలు:
టాక్స్ అసిస్టెంట్గా నియమితులైన వ్యక్తులు ఆదాయపు పన్ను విభాగంలో డేటా ఎంట్రీ, ఫైల్ మేనేజ్మెంట్, పన్ను దరఖాస్తుల ప్రాసెసింగ్ వంటి పనులు చేయాలి . ఇది ఆదాయపు పన్ను శాఖలో ఎంట్రీ లెవల్ పోస్ట్.

జీతం:
లెవెల్-4 పే స్కేల్ ప్రకారం రూ.25,500 నుండి 81,100 వరకు జీతం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

అర్హతలు:

– వయస్సు: 18-25 సంవత్సరాలు వరకు ఉండాలి
– విద్య: ఏదైనా స్ట్రీమ్లో(stream) లో డిగ్రీ చేసిండాలి.
– క్రీడా అర్హత: ఇంటర్-యూనివర్సిటీ/జాతీస్థాయి టూర్నమెంట్లలో పాల్గొన్న రికార్డు ఉండాలి.

 

#మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS):

వివరాలు:
MTS పోస్టులో ఉద్యోగులు కార్యాలయ సహాయక పనులు, ఫైల్ మేనేజ్మెంట్, డాక్యుమెంట్ డెలివరీ వంటి బహుళ పనులు చేస్తారు. ఇది ప్రారంభ స్థాయి ఉద్యోగం.

జీతం:

లెవెల్-1 పే స్కేల్ ప్రకారం రూ.18,000 నుండి 56,900 వరకు జీతం ఉంటుంది. ప్రారంభ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ జీతం పొందుతారు.

అర్హతలు:

– వయస్సు: 18 నుండి 25 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

వయస్సు పరిమితి:

*అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2025 నాటికి నిర్ణయించబడుతుంది.
*స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గాను మరియు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి.

*టాక్స్ అసిస్టెంట్ మరియు MTS పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గాను మరియు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

SC/ST వర్గాలకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు మరియు OBC వర్గాలకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు అందుబాటులో ఉంది. ఈ సడలింపు కేవలం ఆ వర్గాలకు చెందిన మరియు ఇతర అర్హతలను తీర్చే అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది.

విద్య: 10వ తరగతి ఉత్తీర్ణత అయ్యిండాలి .

క్రీడా అర్హత:

స్కూల్/కళాశాల స్థాయి టూర్నమెంట్లలో పాల్గొన్న రికార్డు ఉండాలి.
అభ్యర్థులు క్రీడాకారులుగా గుర్తింపు పొంది ఉండాలి. రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి టూర్నమెంట్లలో పాల్గొన్న వారు లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ లో మెడల్ గెలుచుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ లేదా ప్యారా గేమ్స్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంటర్-యూనివర్సిటీ లేదా స్కూల్ గేమ్స్ లో పాల్గొన్న వారు కూడా అర్హత కలిగి ఉంటారు.

క్రీడా సాధనలను జాతీయ క్రీడా ఫెడరేషన్ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వంటి అధికారిక సంస్థలు ధృవీకరించి ఫారమ్-1 నుండి ఫారమ్-5 లలో సర్టిఫికెట్లు జారీ చేయాలి. ఈ సర్టిఫికెట్లు లేని అభ్యర్థుల దరఖాస్తులు (Rejected ) తిరస్కరించబడతాయి.

5. ఎంపిక ప్రక్రియ:

I.డాక్యుమెంట్ ధృవీకరణ:అసలు డాక్యుమెంట్స్ తనిఖీ .
II.స్కిల్ టెస్ట్:
– స్టెనోగ్రాఫర్: షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ టెస్ట్ .
– టాక్స్ అసిస్టెంట్: డేటా ఎంట్రీ టెస్ట్ .
III.చివరి ఎంపిక: క్రీడా రికార్డు మరియు పరీక్షల ఫలితాల ఆధారంగా

6. దరఖాస్తు ప్రక్రియ:

-ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి
అధికారిక వెబ్సైట్ నందు నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్కోని అక్కడ డిటైల్స్ అన్నీ ఫిల్ చేయండి.
– దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబిసీలకు ₹500 ఉంటుంది.
– ఇతర వర్గాలకు ఎటువంటి ఫీజు ఉండదు. .

7. ముఖ్యమైన సూచనలు:

– ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్/తెలంగాణలోని ఏదైనా ఆదాయపు పన్ను కార్యాలయంలో పోస్టింగ్ పొందుతారు
– 2 సంవత్సరాల ప్రోబేషన్ పీరియడ్ ఉంటుంది
– డోపింగ్ నిషేధాలు లేని క్రీడాకారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి .

8. ముగింపు:

ఈ ఉద్యోగాలు క్రీడాకారులకు ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరీర్ అవకాశాన్ని అందిస్తున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

*హెల్ప్‌లైన్: 040-23425477
*ఇమెయిల్: Hyderabad.ito.hq.welfare@incometax.gov.in

గమనిక:ఈ సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా సిద్ధం చేయబడింది. ఏవైనా మార్పులు రావచ్చు, కాబట్టి అధికారిక వెబ్సైట్ ను నిరంతరం పరిశీలించండి.

Leave a Comment