
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ 2024
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2024 సంవత్సరంలో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1161 ఖాళీలను భర్తీ చేయడానికి ఆసక్తిగల, అర్హత కలిగిన నిరుద్యోగులు,అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఖాళీలు పురుషులకి మరియు మహిళలకి ఇద్దరికీ అందుబాటులో ఉన్నాయి.ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ మార్చి 5,2025 నుండి ఏప్రిల్ 3,2025 రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
-ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 5 మార్చి 2025
-ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 3 ఏప్రిల్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు టైం ఉంటుంది)
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 1161 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఇందులో 1048 ఖాళీలు పురుషులకు మరియు 113 ఖాళీలు మహిళలకు కేటాయించబడ్డాయి. ఈ ఖాళీలు వివిధ ట్రేడ్‌ల కోసం ప్రకటించబడ్డాయి. ప్రతి ట్రేడ్‌లోని ఖాళీల వివరాలు క్రింది విధంగా విభజించబడ్డాయి.
1.కుక్ (Cook):
– పురుషులు: 444
– మహిళలు: 49
– మొత్తం: 493
2. కొబ్లర్ (Cobbler):
– పురుషులు: 8
– మహిళలు: 1
– మొత్తం: 9
3. టైలర్ (Tailor):
– పురుషులు: 21
– మహిళలు: 2
– మొత్తం: 23
4. బార్బర్ (Barber):
– పురుషులు: 180
– మహిళలు: 19
– మొత్తం: 199
5. వాషర్‌మ్యాన్ (Washer-man):
– పురుషులు: 236
– మహిళలు: 26
– మొత్తం: 262
6. స్వీపర్ (Sweeper):
– పురుషులు: 137
– మహిళలు: 15
– మొత్తం: 152
7. పెయింటర్ (Painter):
– పురుషులు: 2
– మహిళలు: 0
– మొత్తం: 2
8. కార్పెంటర్ (Carpenter):
– పురుషులు: 8
– మహిళలు: 1
– మొత్తం: 9
9. ఎలక్ట్రీషియన్ (Electrician):
– పురుషులు: 4
– మహిళలు: 0
– మొత్తం: 4
10. మాలి (Mali):
– పురుషులు: 4
– మహిళలు: 0
– మొత్తం: 4
11. వెల్డర్ (Welder):
– పురుషులు: 1
– మహిళలు: 0
– మొత్తం: 1
12. ఛార్జ్ మెక్ (Charge Mech):
– పురుషులు: 1
– మహిళలు: 0
– మొత్తం: 1
13. ఎంపీ అటెండెంట్ (MP Attendant):
– పురుషులు: 2
– మహిళలు: 0
– మొత్తం: 2
అర్హతలు:
1.వయస్సు పరిమితి:
– కనీస వయస్సు: 18 సంవత్సరాలు
– గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు
– SC/ST/OBC/EWS అభ్యర్థులకు వయస్సు సడలింపు అందుబాటులో ఉంది.
2.విద్యార్హత:
– అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల లేదా సంస్థలో 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
– ట్రేడ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ క్రింది దశలలో జరుగుతుంది.
*ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET):
– పురుషులు: 1.6 కిలోమీటర్ల పరుగు 7 నిమిషాలలో పూర్తి చేయాలి.
– మహిళలు: 800 మీటర్ల పరుగు 5 నిమిషాలలో పూర్తి చేయాలి.
*ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST):
– ఎత్తు, ఛాతీ పరిమాణం మరియు శరీర బరువు తనిఖీ.
*డాక్యుమెంట్ వెరిఫికేషన్:
– అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్ లను వెంట తీసుకురావాలి.
*ట్రేడ్ టెస్ట్:
– ట్రేడ్‌లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.
*రిటెన్ ఎగ్జామ్ (OMR/CBT):
– రిటెన్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నిర్వహించబడుతుంది.
*మెడికల్ ఎగ్జామినేషన్:
– అభ్యర్థులు మెడికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
1.ఆన్‌లైన్ దరఖాస్తు:
– అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2.అప్లికేషన్ ఫీజు:
– జనరల్/OBC/EWS అభ్యర్థులు: ₹100
– SC/ST/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు లేదు
ముఖ్యమైన సూచనలు:
1. అభ్యర్థులు ఒకే ట్రేడ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
2. అసలు డాక్యుమెంట్‌లను తనిఖీ సమయంలో తీసుకురావాలి.
3. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ పొందవచ్చు.
అడ్మిట్ కార్డ్ మరియు ఫలితాలు:
అడ్మిట్ కార్డ్‌లు మరియు ఫలితాలు CISF అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
సంప్రదింపు వివరాలు:
ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం, దయచేసి CISF అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
గమనిక:
– అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.
– దరఖాస్తు ప్రక్రియలో అన్ని డాక్యుమెంట్స్ (విద్యార్హత సర్టిఫికెట్లు, వయస్సు రుజువు మొదలైనవి) సిద్ధంగా ఉంచాలి.




