బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ భర్తీ నోటిఫికేషన్ 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now

బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ భర్తీ 2025 అధికారిక నోటిఫికేషన్ నెంబర్ (BOB/HRM/REC/ADVT/2025/03) విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా 146 వెల్త్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ప్రకటించింది. ఈ భర్తీలు కాంట్రాక్ట్ బేసిస్ పై జరగనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ భర్తీ నోటిఫికేషన్ 2025
బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ భర్తీ నోటిఫికేషన్ 2025

✅ పరిచయం:
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, వెల్త్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కోసం 146 ఖాళీలను ప్రకటించింది. ఈ భర్తీ కాంట్రాక్ట్ బేసిస్ పై జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 26 మార్చి 2025 నుండి అప్లై చేసుకోవచ్చు.చివరి తేదీ 15 ఏప్రిల్ 2025 కు ముందు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యాంశాలు:

✔ 8 విభిన్న పదవులు
✔ ₹6 లక్షల నుండి ₹28 లక్షల వరకు సంవత్సర వేతనం
✔ 26 మార్చి 2025 నుండి 15 ఏప్రిల్ 2025 తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

పోస్ట్ పేరు ఖాళీలు వయస్సు పరిమితి జీతం
1. సీనియర్ రిలేషన్ మేనేజర్ 101 24–35 సంవత్సరాలు ₹8–14 లక్షలు
2. వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్సూరెన్స్) 18 24–45 సంవత్సరాలు ₹12–20 లక్షలు
3. టెరిటరీ హెడ్ 17 27–40 సంవత్సరాలు ₹14–25 లక్షలు
4. ప్రైవేట్ బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్ 03 33–50 సంవత్సరాలు ₹14–25 లక్షలు
5. గ్రూప్ హెడ్ 04 31–45 సంవత్సరాలు ₹16–28 లక్షలు
6. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) 01 57 సంవత్సరాలు ₹18 లక్షలు
7. ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్ 01 24–45 సంవత్సరాలు ₹10–16 లక్షలు
8. పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ 01 22–35 సంవత్సరాలు ₹6–10 లక్షలు

 

1. సీనియర్ రిలేషన్ మేనేజర్ :
✔ఖాళీలు: 101
✔వయస్సు పరిమితి: 24–35 సంవత్సరాలు
✔జీతం :₹8–14 లక్షలు

2. వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్సూరెన్స్):
✔ఖాళీలు:18
✔వయస్సు పరిమితి:24–45 సంవత్సరాలు
✔జీతం:₹12–20 లక్షలు

3. టెరిటరీ హెడ్:
✔ఖాళీలు:17
✔వయస్సు పరిమితి:27–40 సంవత్సరాలు
✔జీతం:₹14–25 లక్షలు

4. ప్రైవేట్ బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్:
✔ఖాళీలు:03
✔వయస్సు పరిమితి:33–50 సంవత్సరాలు
✔జీతం :₹14–25 లక్షలు

5. గ్రూప్ హెడ్:
✔ఖాళీలు:04
✔వయస్సు పరిమితి:31–45 సంవత్సరాలు
✔జీతం :₹16–28 లక్షలు

6. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA):
✔ఖాళీలు:01
✔వయస్సు పరిమితి:57 సంవత్సరాలు
✔జీతం :₹18 లక్షలు

7. ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్:
✔ఖాళీలు:01
✔వయస్సు పరిమితి:24–45 సంవత్సరాలు
✔జీతం :₹10–16 లక్షలు

8. పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్:
✔ఖాళీలు:01
✔వయస్సు పరిమితి:22–35 సంవత్సరాలు
✔జీతం:₹6–10 లక్షలు

📆 ముఖ్యమైన తేదీలు:

✔దరఖాస్తు ప్రారంభం: 26 మార్చి 2025
✔దరఖాస్తు ముగింపు: 15 ఏప్రిల్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
✔ఇంటర్వ్యూ తేదీ: తర్వాత ప్రకటించబడుతుంది

💰 జీతం & ప్రయోజనాలు:-

✔ ఆకర్షణీయమైన పరిహారం ప్యాకేజీ
✔ పని అవకాశాలు PAN India స్థాయిలో
✔ ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ వాతావరణం
✔ కెరీర్ అభివృద్ధి అవకాశాలు

అప్లికేషన్ ఫీజు వివరాలు :
✔జనరల్, EWS & OBC అభ్యర్థులకు ₹600 రూపాయలు ఉంటుంది.( Applicable Taxes + Payment Gateway Charges)
✔ SC, ST, PWD & మహిళలకు ₹100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. (Applicable Taxes + Payment Gateway Charges )

📍గమనిక : ఆన్‌లైన్ పరీక్ష జరిగినా లేదా జరగకపోయినా అనే సంబంధం లేకుండా మరియు ఇంటర్వ్యూ కోసం అభ్యర్థి షార్ట్‌లిస్ట్ చేయబడినా లేదా షార్ట్ లిస్ట్ అవ్వకపోయినా సంబంధం లేకుండా అభ్యర్థి అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జీలను చెల్లించాలి.

📍ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి
2. “కెరీర్స్” ట్యాబ్‌కు వెళ్లండి
3. “వెల్త్ మేనేజ్మెంట్ భర్తీ 2025” లింక్‌ను ఎంచుకోండి
4. ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించండి
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి:
✔ రెజ్యూమ్ (RESUME) (PDF)
✔DOB ప్రూఫ్: 10వ తరగతి మార్కుషీట్/సర్టిఫికేట్ (PDF)
✔ విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్కుషీట్లు/సర్టిఫికేట్ (PDF) (అన్ని విద్యా సర్టిఫికెట్లను ఒకే PDF ఫైల్‌లో స్కాన్ చేయాలి)
✔ WORK EXPERIENCE సర్టిఫికెట్లు (PDF) [If applicable ]
✔ కులం/వర్గం సర్టిఫికెట్ (PDF) [ If applicable ]
✔ PWD సర్టిఫికెట్, [ If applicable ]

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థి పైన పేర్కొన్న పత్రాల యొక్క స్కాన్ చేసిన (డిజిటల్ కాపీలు ) డాకుమెంట్స్ కలిగి ఉండాలి.

క్రింద ఇవ్వబడిన స్పెసిఫికేషన్ల ప్రకారం చూసుకోండి:

✔ అన్ని పత్రాలు PDF ఫార్మాట్‌లో ఉండాలి.
✔ పత్రం యొక్క పేజీ పరిమాణం A4గా ఉండాలి.
✔ ఫైల్ పరిమాణం 500 KB మించకూడదు.
✔ డాక్యుమెంట్ స్కాన్ చేయబడితే, దయచేసి అది పిడిఎఫ్ గా సేవ్ చేసుకోండి.మరియు PDF సైజు 500 KB కంటే ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు. దయచేసి అప్‌లోడ్ చేయబడిన పత్రాలు స్పష్టంగా మరియు చదవగలిగేలా ఉండేలా చూసుకోండి.

6. అప్లికేషన్ ఫీజు చెల్లించండి
7. అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి

ఎంపిక ప్రక్రియ:-

1.శార్ట్‌లిస్టింగ్:అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
2. పర్సనల్ ఇంటర్వ్యూ (PI):
✔ఇంటర్వ్యూ ప్యానెల్ క్యాండిడేట్‌ల నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు డొమైన్ నాలెడ్జ్ అంచనా వేస్తారు .
3.డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఒరిజినల్ డిగ్రీ/ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించాలి.

👉ముఖ్యమైన సూచనలు :

✔ ఒకే ఒక పోస్ట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు
✔ అసలు డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ సమయంలో హాజరుపరచాలి
✔ తప్పుడు సమాచారం ఇచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి

సంప్రదింపు వివరాలు:-

☎ హెల్ప్‌లైన్: 1800 258 4455 / 1800 102 4455
📧 ఇమెయిల్: careers@bankofbaroda.in
🌐 అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ నుండి తీసుకోబడింది. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను సంప్రదించండి. అభ్యర్థులు 15 ఏప్రిల్ 2025 కు ముందు దరఖాస్తు చేసుకోవాలి. లేట్ అప్లికేషన్లు తిరస్కరించబడతాయి.

📍 మీ దరఖాస్తు మరియు ఉద్యోగం లో విజయం సాధించాలని కోరుకుంటున్నాము!

Leave a Comment