NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ భర్తీ 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now

NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ భర్తీ 2025 (NPCIL/HQ/HRM/ET/2025/02) నోటిఫికేషన్ విడుదల చేశారు.భారత అణుశక్తి సంస్థలో కెరీర్ అవకాశాలు కలిపిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు 10 ఏప్రిల్ 2025 ఉదయం 10:00 గంటల నుండి 30 ఏప్రిల్ 2025 సాయంత్రం 04:00pm గంటల లోపు అప్లై చేసుకోవచ్చు.

NPCIL
NPCIL

పూర్తి వివరాల కోసం క్రింద చదవండి.

1. పరిచయం:

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ అణుశక్తి సంస్థ, మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ET) ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది.

ఈ ఉద్యోగాలు మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ & సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. ఎంపికయిన అభ్యర్థులు 1-సంవత్సరం శిక్షణ తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ గా నియమించబడతారు.

2. కీలక తేదీలు:

➡ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10 ఏప్రిల్ 2025 (10:00 AM)
➡దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025 (4:00 PM)
➡ఇంటర్వ్యూ: జూన్ 9–21, 2025 (ముందస్తు)
➡జాయినింగ్: డిసెంబర్ 2025

3. ఖాళీలు & శాఖల వివరాలు:

🔹 మెకానికల్ ఇంజినీరింగ్:
మొత్తం ఖాళీలు: 150 (UR: 58, EWS: 15, SC: 23, ST: 12, OBC: 42)
అర్హత: BE/B.Tech (మెకానికల్/ప్రొడక్షన్) లో కనీసం 60% మార్కులు రావాలి .

🔹 కెమికల్ ఇంజినీరింగ్:
మొత్తం ఖాళీలు: 60 (UR: 23, EWS: 6, SC: 9, ST: 5, OBC: 17)
అర్హత:BE/B.Tech (కెమికల్/ఎలక్ట్రో-కెమికల్).

🔹 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్:
మొత్తం ఖాళీలు: 80 (UR: 32, EWS: 8, SC: 12, ST: 6, OBC: 22)
అర్హత: BE/B.Tech (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్).

🔹 ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్:
మొత్తం ఖాళీలు:45 (UR: 18, EWS: 4, SC: 7, ST: 4, OBC: 12)
అర్హత: BE/B.Tech (ఎలక్ట్రానిక్స్/ECE/ETC).

🔹 ఇన్స్ట్రుమెంటేషన్:
మొత్తం ఖాళీలు:20 (UR: 8, EWS: 2, SC: 3, ST: 1, OBC: 6)
అర్హత: BE/B.Tech (ఇన్స్ట్రుమెంటేషన్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్).

🔹 సివిల్ ఇంజినీరింగ్:
మొత్తం ఖాళీలు: 45 (UR: 18, EWS: 4, SC: 7, ST: 4, OBC: 12)
అర్హత: BE/B.Tech (సివిల్).

ముఖ్యమైన నోట్స్:

GATE 2023/2024/2025 స్కోర్ మాత్రమే అంగీకరించబడుతుంది
ఫీజు చెల్లించే అవధి: 10 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2025 వరకు మాత్రమే.

PwBD అభ్యర్థులకు ఇంటర్వ్యూ వెన్యూ వద్ద స్పెషల్ అసిస్టెన్స్ ఉంటుంది.

PwBD రిజర్వేషన్:16 ప్రస్తుతం + 12 బ్యాక్లాగ్ ఖాళీలు (40% డిసేబిలిటీ ఉన్నవారు).

4. విద్యా అర్హత & వయస్సు పరిమితి:

విద్యా అర్హత:
BE/B.Tech/B.Sc (ఇంజినీరింగ్) లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech with 60% మార్కులు కలిగి ఉండాలి.
GATE స్కోరు: 2023/2024/2025లో సంబంధిత శాఖలో క్వాలిఫైయింగ్ మార్కులు.

వయస్సు పరిమితి (30 ఏప్రిల్ 2025 నాటికి):

జనరల్/EWS అభ్యర్థులకి 26 సంవత్సరాలు నిండి ఉండాలి.
OBC (NCL): 29 సంవత్సరాలు ఉండాలి.(3 సంవత్సరాల రిలాక్సేషన్)
SC/ST:31 సంవత్సరాలు ఉండాలి.(5 సంవత్సరాల రిలాక్సేషన్)
PwBD: 10 సంవత్సరాల అదనపు రిలాక్సేషన్ ఉంటుంది.

5. ఎంపిక ప్రక్రియ:

🔹 దశ 1: GATE స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ ఉంటుంది.
GATE 2023/2024/2025 స్కోర్ ప్రకారం 1:12 రేషియోలో అభ్యర్థులని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

🔹 దశ 2: పర్సనల్ ఇంటర్వ్యూ:
క్వాలిఫైయింగ్ మార్కులు:
జనరల్ అభ్యర్థులకి 70% మార్కులు రావాలి.
EWS/SC/ST/OBC/PwBD అభ్యర్థులకి 60% మార్కులు రావాలి
ఫైనల్ సెలెక్షన్: ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ తో మాత్రమే ఉంటుంది.(GATE స్కోర్ తో కాదు).

🔹 దశ 3: మెడికల్ ఫిట్నెస్:
NPCIL మెడికల్ బోర్డ్ ద్వారా ఫిట్నెస్ ధృవీకరించబడుతుంది.

6. సాలరీ & శిక్షణ వివరాలు:

🔹 శిక్షణ కాలంలో:
స్టైపెండ్: ₹74,000/నెలకి ఉంటుంది.
బుక్ అలవెన్స్: ₹30,000 (ఒక్కసారి మాత్రమే ) ఇస్తారు.
ఆవాసం (స్టేయింగ్): NPCIL ట్రెయినింగ్ సెంటర్లలో ఉచిత లాడ్జింగ్.

🔹 శిక్షణ తర్వాత (సైంటిఫిక్ ఆఫీసర్ గా):
పే స్కేల్: లెవెల్ 10 (₹56,100 + DA 53%) ఉంటుంది.

అదనపు ప్రయోజనాలు:
HRA, TA, మెడికల్ ఇన్సూరెన్స్
పెన్షన్, గ్రాచ్యుటీ, హోం లోన్ ఫెసిలిటీ ఉంటాయి.

7. దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

1.ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
2. ఫీజు:
జనరల్/EWS/OBC మగవారికి ₹500 ఫీజు ఉంటుంది.
SC/ST/PwBD/మహిళలకి ఎటువంటి ఫీజు లేదు.
3. డాక్యుమెంట్స్: GATE స్కోర్ కార్డ్, డిగ్రీ మార్క్ సీట్స్ , జనన ధృవపత్రం( బర్త్ సర్టిఫికెట్ ).

8. ప్రిపరేషన్ టిప్స్:

🔹 టెక్నికల్ ప్రిపరేషన్:
కోర్ సబ్జెక్ట్స్: థర్మోడైనమిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, పవర్ సిస్టమ్స్
GATE సిలబస్: 85% వెయిటేజ్ టెక్నికల్ ప్రశ్నలు

ఇంటర్వ్యూ టిప్స్:
NPCIL ప్రాజెక్ట్స్: కుడంకుళం, తారాపూర్, కైగా ప్లాంట్ల గురించి తెలుసుకోండి
కరెంట్ అఫైర్స్: అంతర్జాతీయ అణు ఒప్పందాలు (NPTE, IAEA)

9. ముఖ్యమైన లింకులు & సంప్రదింపు:

అధికారిక నోటిఫికేషన్: [NPCIL కెరీర్స్] కోసం ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE
హెల్ప్‌లైన్: 022-2596 0500
ఇమెయిల్: recruitment@npcil.co.in

గమనిక: ఈ ఉద్యోగాలు అణుశక్తి ప్రాజెక్టుల్లో (తారాపూర్, కుడంకుళం, కైగా వంటి ప్రదేశాల్లో) పోస్టింగ్ అవుతాయి.

మరిన్ని వివరాల కోసం NPCIL అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి!

Leave a Comment