ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) రిక్రూట్మెంట్ 2025 (ADVERTISEMENT No. 02/2025/CHQ) 309 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , భారత ప్రభుత్వం యొక్క మినీ రత్న కేటగరీ-1 సంస్థ, 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పదవులకు దరఖాస్తులను 25 ఏప్రిల్ 2025 నుండి ఆహ్వానిస్తోంది. చివరి తేదీ 24 మే 2025 లోపు అప్లై చేసుకోవచ్చు.ఈ భర్తీ గ్రూప్-B (E-1 లెవల్) పోస్టులకు, ఫుల్-టైమ్, రెగ్యులర్ ఉద్యోగాలు గా ఉంటాయి.

హైలైట్స్:
✔ మొత్తం ఖాళీలు :309
✔ జీతం : ₹40,000 – ₹1,40,000 (IDA పే స్కేల్)
✔ CTC అంచనా: సంవత్సరానికి ₹13 లక్షలు ఉంటుంది.
✔ అర్హతలు : B.Sc (Physics & Mathematics) లేదా B.E./B.Tech చదివిండాలి.
✔ వయస్సు పరిమితి: 27 సంవత్సరాలు (SC/ST/OBC/PwBD అభ్యర్థులకు Age relaxation ఉంది) నిండి ఉండాలి.
✔ అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
| పోస్టు పేరు | UR | EWS | OBC (NCL) | SC | ST | PwBD (c) | మొత్తం ఖాళీలు |
| జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) | 125 | 30 | 72 | 55 | 27 | 07 | 309 |
గమనిక: ఖాళీల సంఖ్య తాత్కాలికం మరియు AAI యొక్క స్వంత అభీష్టానుసారం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
అర్హతలు:
1. విద్యా అర్హతలు:
– సైన్స్‌లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్‌తో మూడేళ్ల ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc) చేసిండాలి.
– ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ చేసిండాలి.(ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ సెమిస్టర్ పాఠ్యాంశాల్లో ఏదైనా ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా కలిగి ఉండాలి).
– అభ్యర్థికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటం మరియు ఇంగ్లీషు రాయడం రెండింటిలోనూ కనీస ప్రావీణ్యం ఉండాలి.(అభ్యర్థి 10వ తరగతి లో లేదా ఇంటర్ లో ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలి).
2. వయస్సు పరిమితి(Age Limit): (24.05.2025 నాటికి) గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు వరకు ఉండాలి.
📍వయస్సు సడలింపు (Age Relaxation):
– SC/ST: +5 సంవత్సరాలు
– OBC (NCL): +3 సంవత్సరాలు
– PwBD: +10 సంవత్సరాలు
– Ex-Serviceman: +5 సంవత్సరాలు
3. PwBD అర్హతలు:
– అనుమతించబడిన వైకల్యాలు:
– యాసిడ్ దాడి బాధితులు (medical fitness for ATC license required).
గమనిక:
(i) పోస్టుకు తగినట్లుగా గుర్తించబడిన వివిధ వర్గాల వైకల్యం యొక్క నిర్వచనం RPwD చట్టం, 2016 ప్రకారం నిర్వచించబడింది
(ii) గుర్తించబడిన పోస్టుకు నియామకం చేసే ముందు, పోస్టుకు వ్యతిరేకంగా పేర్కొన్న విధంగా సంబంధిత ఫంక్షనల్ అవసరాల పరంగా PwBD అభ్యర్థులను కూడా అంచనా వేయాలి.
📅 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 25 ఏప్రిల్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : 24 మే 2025
CBT టెస్ట్ తేదీ : తర్వాత ప్రకటించబడుతుంది.
✅ జీతం & ప్రయోజనాలు :
– పే స్కేల్: ₹40,000 – 3% – ₹1,40,000 (IDA) ఉంటుంది.
– అదనపు ప్రయోజనాలు :
– DA (డియర్నెస్ అలవెన్స్)
– HRA (హౌస్ రెంట్ అలవెన్స్)
– పెర్క్స్ (35% బేసిక్ పే)
– CPF, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్
-CTC అంచనా: ₹13 లక్షలు/సంవత్సరం.
✅ ఎంపిక ప్రక్రియ:
1. కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT):
– నెగెటివ్ మార్కులు లేవు .
– సిలబస్: AAI ఆఫీసియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
2. షార్ట్‌లిస్టింగ్ : CBT పర్ఫార్మెన్స్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ ఉంటుంది .
3. అప్లికేషన్ వెరిఫికేషన్ :
– డాక్యుమెంట్ చెక్కింగ్ (ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి).
4. ఇతర టెస్ట్లు :
– వాయిస్ టెస్ట్
– సైకాలజికల్ అసెస్‌మెంట్
– మెడికల్ ఎగ్జామినేషన్ (ATC లైసెన్స్ కోసం ఫిట్‌నెస్ అవసరం).
✅ ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. AAI అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
2. “Careers” ట్యాబ్‌కు వెళ్లండి.
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ATC) భర్తీ 2025 లింక్‌ను ఎంచుకోండి.
4.ఆన్‌లైన్ ఫారమ్ ఈ క్రింది వివరాలతో నింపండి.(వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హత, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి)
5. అప్లికేషన్ ఫీజు :
– జనరల్/OBC/EWS అభ్యర్థులకి ₹1000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.(ఆన్‌లైన్ మోడ్ లో చెల్లించాలి).
– SC/ST/PwBD/AAI అప్రెంటిసెస్/మహిళలకి ఎటువంటి ఫీజు ఉండదు.
6. సబ్‌మిట్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
⚠ముఖ్యమైన సూచనలు:
– ఫీజు రీఫండ్: ఎటువంటి పరిస్థితిలోనూ ఫీజు రీఫండ్ చేయబడదు.
-డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ సమయంలో అసలు సర్టిఫికెట్లు తీసుకురావాలి.
-NOC: ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు NOC తీసుకురావాలి.
📞 సంప్రదింపు వివరాలు:
హెల్ప్‌లైన్: AAI రీజనల్ ఆఫీస్ నంబర్లు (వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి).
ఇమెయిల్: recruitment@aai.aero
అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ ఉన్న లింక్ క్లిక్ చేయండి. Click Here
✅గమనిక: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను AAI వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. మరే ఇతర విధానం ద్వారా దరఖాస్తులు అంగీకరించబడవు.
✅ ముగింపు:
AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ATC) పోస్ట్ భారతదేశంలో విమానయాన రంగంలో కెరీర్ కోసం స్టేబుల్, హై-పేయింగ్ అవకాశం కలిపిస్తోంది. 24 మే 2025 కు ముందు దరఖాస్తు చేసుకోండి. డిటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం AAI వెబ్‌సైట్ చూడండి.
✅ విమానయాన రంగంలో మీ కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటే ఈ గోల్డన్ అవకాశాన్ని వదిలిపెట్టకండి. అల్ ది బెస్ట్ ఫ్రెండ్స్!!




