ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష RTE 1వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 5 సంవత్సరాలు నిండిన, ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకి ఉచిత విద్య అందించాలని నిర్ణయించడం జరిగింది. స్కూల్స్ లో మొత్తం 50,000 పైగా సీట్స్ ఉన్నాయి. చివరి తేదీ 15 మే 2025.

🔹 1. పరిచయం (Introduction):
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTE చట్టం 2009, సెక్షన్ 12(1)(C) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి క్లాస్ 1 ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రకటనలో అన్ని ప్రైవేట్ అనైడెడ్ స్కూళ్ళు (IB/CBSE/ICSE/స్టేట్ సిలబస్) పాల్గొంటాయి. ప్రతి స్కూల్ లో 25% సీట్లు ఆర్థికంగా బలహీన వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాల పిల్లలకు కేటాయించబడతాయి.
ప్రధాన లక్ష్యాలు:
-ఉచిత & సమతుల్య విద్య అందించడం జరుగుతుంది.
-ఆర్థికంగా బలహీన కుటుంబాల పిల్లలకు ప్రతిష్టాత్మక స్కూళ్ళలో అవకాశాలు ఉంటాయి.
– 1 క్లాస్ నుండి 8 క్లాస్ వరకు ఫీజు మినహాయింపు ఉంటుంది .
🔹 2. ప్రవేశాల వివరాలు (Admission Overview):
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఖాళీలు :50,000 + ఉన్నాయి.(ప్రతి స్కూల్ లో 25% రిజర్వేషన్ ఉంటుంది ).
స్కూల్ రెండు రకాలు:
స్టేట్ బోర్డ్ స్కూళ్ళు (AP సిలబస్).
CBSE/ICSE/IB స్కూళ్ళు.
ప్రవేశ పద్ధతి:ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు .
🔹 3. అర్హత షరతులు (Eligibility Criteria):
వయసు పరిమితి:
– CBSE/ICSE/IB స్కూళ్ళు:5 సంవత్సరాలు ఉండాలి.(31 మార్చి 2025 నాటికి పూర్తి చేయాలి).
– స్టేట్ సిలబస్ స్కూళ్ళు: 5 సంవత్సరాలు ఉండాలి.(1 జూన్ 2025 నాటికి పూర్తి చేయాలి).
దస్తావేజులు అవసరం:
1. పిల్లల జనన ధృవపత్రం (బర్త్ సర్టిఫికెట్).
2. కుటుంబ ఆదాయ ధృవపత్రం (EWS/SC/ST/OBC అవసరం అయితే).
3. ఆధార్ కార్డు (పిల్లలు & తల్లిదండ్రులు).
4. నివాస ధృవపత్రం (వోటర్ ID/ఎలక్ట్రిసిటీ బిల్లు/ఇష్యూ కాంట్రాక్ట్).
🔹 4. కేటగిరీ వారీగా ఖాళీలు (Category-wise Vacancies):
జనరల్ (UR): 15,000 సీట్లు
EWS: 5,000 సీట్లు
SC: 7,500 సీట్లు
ST: 3,750 సీట్లు
OBC (నాన్-క్రీమీ లేయర్): 13,500 సీట్లు
PwD (అంగవైకల్యం): 2,000 సీట్లు ఉన్నాయి.
గమనిక : స్కూల్ లొకేషన్ & డిమాండ్ ప్రకారం మారవచ్చు.
🔹 5. దరఖాస్తు ప్రక్రియ (Application Process):
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 17 ఏప్రిల్ 2025
ఆన్లైన్ దరఖాస్తు: 28 ఏప్రిల్ – 15 మే 2025
1వ రౌండ్ లాటరీ ఫలితాలు: 21 మే 2025
2వ రౌండ్ లాటరీ ఫలితాలు: 6 జూన్ 2025
దరఖాస్తు చేసే విధానం:
1: అధికారిక వెబ్సైట్ లో లాగిన్ చేయాలి.
2: “RTE Class 1 Admissions 2025” ఎంచుకోండి.
3: పిల్లల & తల్లిదండ్రుల వివరాలు నింపండి.
4: డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి (PDF/JPEG ఫార్మాట్ లో).
5: సబ్మిట్ చేసి, ఆఖరు స్లిప్ ప్రింట్ చేయండి.
🔹 6. ఎంపిక ప్రక్రియ (Selection Process):
1.ఆటోమేటెడ్ లాటరీ సిస్టం ద్వారా ఎంపిక.
2. మెరిట్ లేదు, కేవలం ర్యాండమ్ ఎంపిక.
3. రెండు రౌండ్ల లాటరీలు (1వ రౌండ్ లో సీట్లు ఖాళీ అయితే 2వ రౌండ్ నిర్వహిస్తారు).
4. సెలెక్ట్ అయిన పిల్లలు స్కూల్ కు డాక్యుమెంట్స్ ధృవీకరణకు వెళ్లాలి.
🔹 7. ప్రయోజనాలు & సదుపాయాలు (Benefits):
ఉచిత విద్య (ట్యూషన్ ఫీజు, బుక్స్, యూనిఫారమ్ మినహాయింపు).
స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (లైబ్రరీ, ల్యాబ్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్).
మిడ్ డే మీల్స్ ఉంటుంది.(ఆరోగ్యకరమైన ఫుడ్).
ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలు ఉంటాయి.(కొన్ని స్కూళ్ళలో).
🔹 8. తుది జాబితా & డాక్యుమెంట్ ధృవీకరణ (Final Steps):
1.లాటరీ ఫలితాలు స్కూల్ గేట్ & వెబ్సైట్ లో ప్రకటిస్తారు.
2. సెలెక్ట్ అయిన పిల్లలు 7 రోజులలో స్కూల్ కు ఈ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలి
ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్.
ఆదాయ ధృవపత్రం (EWS/SC/ST/OBC).
ఆధార్ కార్డ్ కాపీ.
3. డాక్యుమెంట్స్ ధృవీకరణ తర్వాత మాత్రమే ఫైనల్ అడ్మిషన్ ఉంటుంది.
🔹 9. ముఖ్యమైన సూచనలు & హెల్ప్‌లైన్ (Important Tips):
చివరి రోజు అప్లికేషన్ వేసుకోవచ్చులే అని నెగ్లెట్ చేయకండి.(సర్వర్ లోడ్ సమస్యలు ఉండవచ్చు).
ఫోటో/సిగ్నేచర్ స్పష్టంగా అప్లోడ్ చేయండి.
స్కూల్ లొకేషన్ ముందే వెరిఫై చేసుకోండి. (RTE ప్రకారం 1 కి.మి. రేడియస్ లో ఉండాలి).
హెల్ప్‌లైన్:
టోల్ ఫ్రీ: 1800-425-8599
ఈమెయిల్: rtehelp.ap@gov.in
మూలం: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అధికారిక నోటిఫికేషన్, ఏప్రిల్ 2025
మీకేమైనా అప్లికేషన్ సమస్యలు, సందేహాలు ఉంటే మాకు కామెంట్ చేయండి.




